ఎప్పుడూ ముంబై ఇండియన్స్ గెలుస్తున్నా ఒకటే గోల. ఐపీఎల్ ఫిక్స్ చేశారు. వాళ్లు మ్యాచ్ లు గెలవటానికి అంపైర్లతో మాట్లాడేసుకున్నారు. అందుకే అంపైర్ల నిర్ణయాలన్నీ ముంబైకి అనుకూలంగా వస్తాయి అని. ఇప్పుడు వరుసగా ఆరు మ్యాచులు గెలిచి ముంబై టేబుల్ టాపర్ స్థాయికి వెళ్లింది. మరి ఈ జర్నీలో ముంబైకి అంపైర్లు సహకరిస్తున్నారా అనేది మిగిలిన టీమ్స్ అభిమానులకు పెద్ద ప్రశ్న. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లోనే రెండు వివాదాస్పద నిర్ణయాలు ఉన్నాయి. రెండూ ముంబై బ్యాటింగ్ చేస్తున్నప్పుడే జరిగాయి. మొదటి ఘటన రెండో ఓవర్ ఆఖరి బంతికి జరిగింది. ఫజల్ ఫరూఖీ వేసిన బాల్ ను మిస్సయిన హిట్ మ్యాన్..ప్యాడ్ కి బంతిని తాకించుకున్నాడు. దీంతో ఫరూఖీ అప్పీల్ చేయగా ఆన్ ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చేశాడు. అయితే రికెల్టెన్ తో ఆ నిర్ణయంపై డీఆర్ఎస్ కి వెళ్లాలా లేదా అని చర్చిస్తూ కూర్చున్నాడు రోహిత్ శర్మ. వెంటనే డీఆర్ఎస్ కి వెళ్తున్నాడా లేదా చెప్పకుండా నిర్ణీత టైమ్ వరకూ వెయిట్ చేశాడు. కరెక్ట్ గా టైమర్ సున్నా మీద వచ్చాక డీఆర్ఎస్ అడిగాడు. టైమ్ అయిపోయింది నువ్వు ఇక అవుటే అని చెప్పాల్సిన అంపైర్ మాత్రం సున్నా మీద అడిగినా కూడా రోహిత్ నిర్ణయాన్ని కన్సిడర్ చేసి థర్డ్ అంపైర్ కి ఇచ్చాడు. సరే అక్కడేదో సున్నా మీదకు అప్పుడే వచ్చింది.ఫ్రాక్షన్ ఆఫ్ సెకన్స్ కాబట్టి కన్సిడర్ చేశారు అనుకుందాం. రివ్యూలో తేలింది ఏంటంటే బాల్ కరెక్ట్ గా లైన్ మీద సగం అటూ సగం ఇటూ పడింది. అది రీ ప్లేలో స్పష్టంగా కనిపిస్తోంది. 50-50 ఛాన్స్ ఉన్నప్పుడు ఆన్ గ్రౌండ్ అంపైర్ ఏం డెసిషన్ చెప్పాడో అదే కరెక్ట్ అయ్యేలా అంపైర్స్ కాల్ ఇస్తారు జనరల్ గా కానీ నిన్న అలా జరగలేదు. 50 పర్సెంట్ బాల్ లైన్ లోపల ఉన్నా కూడా పిచ్ అవుట్ సైడ్ అని ఇచ్చి థర్డ్ అంపైర్ రోహిత్ ను నాటౌట్ గా ప్రకటించారు. షాకింగ్ అసలు. ఇది జరిగినప్పుడు ముంబై స్కోరు 9..రోహిత్ స్కోరు 7. మరి అప్పుడే నిర్ణయం సరిగ్గా ఉంటే అసలు రోహిత్ హాఫ్ సెంచరీ చేసేవాడు కాదు కదా. ఇది మొదటిది. ఇంకోటి రెండోది. ఆరో ఓవర్ ఆఖరి బంతికి జరిగింది. తీక్షణ బౌలింగ్ లో రికెల్టెన్ ఈ సారి బాల్ మిస్సయ్యాడు. ప్యాడ్ కి తగిలింది బాల్. లైన్ పడింది తను LBW అయిపోయాయని అనుకున్న రికెల్టెన్ డగౌట్ వైపు నడిచేయటం మొదలుపెట్టాడు. అయితే అంపైర్ మాత్రం అది అవుట్ అని చెప్పకపోవటం..బౌలర్లు అప్పీల్ కూడా చేయకపోవటంతో ఆగిపోయాడు. ఇక్కడ రికెల్టెన్ అవుటైనా కాకపోయినా...బ్యాటర్ తను ఇష్టానుసారంగా అవుట్ అనుకుని వెళ్లిపోతున్నప్పుడు అవుట్ ఇచ్చేయాలి. ఎందుకంటే ఈ రూల్ మొన్న ఇదే ముంబై హైదరాబాద్ మీద ఆడినప్పుడు వాడారు. అప్పుడు ఇషాన్ కిషన్ బ్యాట్ కి బాల్ తగలకున్న తను అవుట్ అనుకుని తనే వెళ్లిపోతుండటంతో దీపక్ చాహర్ అప్పీల్ చేయగానే అంపైర్ అవుట్ ఇచ్చాడు. ఎందుకంటే బ్యాటర్ వాలంట్రీగా వెళ్లిపోతున్నాడు కాబట్టి. మరి ఆ లెక్కన నిన్న రికెల్టెన్ కూడా అవుటేగా. కానీ అంపైర్ అలా అవుటివ్వలేదు. నిన్న రికెల్టెన్ కూడా హాఫ్ సెంచరీ బాది..ముంబై 217పరుగుల భారీ స్కోరు చేయటంలో హెల్ప్ అయ్యాడు. తెలియకుండా చేస్తుంటే కనీసం మనకు తెలియదు అనుకోవచ్చు. కానీ కళ్ల ముందే ఇలా అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు ముంబైకి కలిసి వస్తుంటే..ఫిక్సింగ్ కాక ఇంకేం అనాలి అనేది మిగిలిన టీమ్స్ అభిమానుల ప్రశ్న.